For Money

Business News

ఎయిర్‌టెల్‌: రైట్‌ ఇష్యూ నేడే ఓపెన్‌

భారతీ ఎయిర్‌ టెల్‌ కంపెనీ రైట్స్ ఇష్యూ ఇవాళ ప్రారంభం కానుంది. ఈ ఇష్యూ ద్వారా రూ. 21,000 కోట్లు సమీకరించాలని కంపెనీ ప్రతిపాదించింది. ఈ ఇష్యూ ఈనెల 21వ తేదీన ముగుస్తుంది. రైట్స్‌ కింద 39,22,87,662 ఈక్వీటీ రైట్స్‌ను జారీ చేస్తున్నారు. రూ. 5 ముఖ విలువ గలిగిన ఒక్కో షేర్‌ను రూ. 535లకు ఆఫర్‌ చేస్తున్నారు. ఇప్పటికే కంపెనీలో వాటాదారులుగా ఉన్నవారు అదనంగా షేర్లను కొనుగోలు చేసేందుకు కంపెనీ ఈ ఆఫర్‌ చేస్తోంది. రికార్డు తేదీ నాటికి (సెప్టెంబర్‌ 28) కంపెనీ ఖాతాల్లో ఉన్న ప్రతి 14 షేర్లకు ఒక షేర్‌ను రైట్స్‌ కింది జారీ చేస్తారు. భారతీ ఎయిర్‌టెల్‌లో ప్రమోటర్లకు 55.8 శాతం వాటా ఉండగా, మిగిలిన వాటా ప్రజలకు ఉంది.