For Money

Business News

గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌కు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌

షేర్‌ మార్కెట్‌ ఎక్స్ఛేంజ్‌ మాదిరిగానే గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ రానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి) ఆమోదం తెలిపింది. షేర్లలాగానే ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ను జారీ చేస్తారు. ఇవి ఎక్స్ఛేంజ్‌లో ట్రేడవుతాయి. ఎలక్ట్రానిక్‌ గోల్డ్స్‌ రిసీట్స్‌ (EGRs)పేరుతో వీటిని పిలుస్తారని.. ఇవి షేర్ల మాదిరిగా ఎక్స్ఛేంజీలో ట్రేడవుతాయని సెబీ ఛైర్మన్‌ అజయ్‌ త్యాగి మీడియాకు తెలిపారు.దీనివల్ల కచ్చిత బంగారం రేటు కనుగొనడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు వివిధ నగరాల బులియన్‌ అసోసియేషన్లు నిర్ణయించిన ధరలను జనం బంగారం, వెండి కొంటున్నారు.