డెల్టా కార్ప్: ఇందులో పెట్టుబడి జూదం కాదు
దేశంలోనే ఈ రంగంలో ఉన్న ఏకైక కంపెనీ. కాసినో, హాస్పిటాలిటీ రంగంలో ఉన్న ఈ కంపెనీ ఇప్పటి వరకు ఇన్వెస్టర్లను ఎపుడూ నిరాశపర్చలేదు. గోవా సమీపంలో సముద్రంపై మూడు కాసినోలు నడుపుతున్న ఈ కంపెనీ తాజాగా నేపాల్‌కు కూడా విస్తరించింది. ఏడాదిలో 131 శాతం పెరిగిన ఈ కంపెనీ నెలలోనే 41 శాతం పెరగడం విశేషం. ప్రస్తుతం రూ. 246 వద్ద ఈ షేర్ ట్రేడవుతోంది. కరోనా కారణంగా ఆగిపోయిన సిక్కీం, నేపాల్‌లో కంపెనీ కార్యకలాపాలు నెలలో మళ్ళీ ప్రారంభమౌతాయిన కంపెనీ హార్దిక్ ధేబర్ తెలిపారు. గోవా, సిక్కింలలో ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ కూడా కంపెనీ దృష్టి సారిస్తోంది. గోవాలోన మాండొవి నదిపై మూడు ఆఫ్ షోర్ గేమింగ్ బోట్లను ఈ కంపెనీ నిర్వహిస్తోంది.అలాగే గోవాలో ఆల్ సూట్ హోటల్‌తో పాటు ఆన్‌షోర్ కాసినో కూడా నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి దామన్‌లో ఇంటిగ్రేటెడ్ రిసార్ట్ కూడా ఉంది. సిక్కింలో కూడా క్యాసినోను నిర్వహిస్తోంది. కంపెనీ పనితీరు మరింత మెరుగ్గా ఉంటుందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హార్ధిక్ ధేబర్ అంటున్నారు. భిన్నమైన రంగానికి చెందిన ఈ కంపెనీ మున్ముందు మంచి ఫలితాలను అందించే అవకాశముంది.