For Money

Business News

రాంకీ ఎన్విరో: కేకేఆర్‌ ఔట్‌

హైదరాబాద్‌కు చెందిన రాంకీ ఎన్విరో ఇంజనీర్స్‌లో కేకేఆర్‌ హోల్డింగ్స్‌ తన వాటాను విక్రయించనుంది. మెజార్టీ వాటాను తమసేక్‌ హోల్డింగ్స్‌, బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డీల్‌ విలువ 100 కోట్ల డాలర్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. రెండేళ్ళ క్రితం రాంకీ గ్రూపు ప్రమోటర్‌ ఎ.అయోధ్య రామిరెడ్డి నుంచి కంపెనీలో 60 శాతం వాటాను కేకేఆర్‌ కొనుగోలు చేసింది. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించాలని భావించిన కేకేఆర్‌… ఇపుడు మొత్తం వాటాను అమ్మేసేందుకు రెడీ అయింది. కేకేఆర్‌ వాటాను కొనుగోలు చేసేందుకు తమసేక్‌ హోల్డింగ్స్‌, బ్రూక్‌ఫీల్డ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ డీల్‌ కుదిరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.