సీరమ్, బయోకాన్ డీల్
బయోకాన్, సీరమ్ ఇన్స్టిట్యూట్ మధ్య వ్యూహాత్మక డీల్ కుదరింది. బయోకాన్ అనుబంధ సంస్థ అయిన బయోకాన్ బయోలాజిక్స్లో 15 శాతం వాటాను సీరం ఇనిస్టిట్యూట్ అనుబంధ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ లైఫ్ సైన్సెస్ కొనుగోలు చేయనుంది. బయోకాన్ బయోలాజిక్స్ (BBL) విలువను 490 కోట్ల డాలర్లు లెక్కించి… ఆ లెక్కన 15 శాతం వాటాను సీరమ్ తీసుకుంది. దీనికి బదులుగా పూనేలో సీరం లైఫ్ సైన్సెస్ (SILS)కు ఉన్న వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని బయోకాన్ వాడుకుంటుంది. సీరమ్ నుంచి ఏటా 10 కోట్ల డోస్‌ల టీకాను బయోకాన్ తయారు చేసుకుంటుంది. ఈ ఒప్పందం 15 ఏళ్ళ పాటు అమల్లో ఉంటుంది. వాటా కొనుగోలు చేసినందున బయోకాన్ బయోలాజిక్స్ బోర్డులో
సీరం సీఈఓ అదార్ పూనావాలా చేరుతారు.