For Money

Business News

NIFTY TRADE: పడితే కొనొచ్చా…

నిఫ్టి ఇవాళ నష్టాలో ప్రారంభమయ్యే అవకాశముంది. సింగపూర్‌ నిఫ్టి 80 పాయింట్ల నష్టంతో ఉన్నా… ఆ స్థాయి నష్టాలు ఉండకపోవచ్చు. నిఫ్టికి ఇవాళ 17,330 ప్రాంతంలోనే మద్దతు అందుతుందేమో చూడాలి. ఎందుకంటే నిఫ్టి క్రితం ముగింపు 17,369. డాలర్‌ పెరుగుతున్నా… క్రూడ్‌ 74 డాలర్లవైపు పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి 17,300 స్థాయికి చేరుతుందేమో చూడాలి. నిఫ్టికి ఈ స్థాయిలో మద్దతు అందకపోతే 17,275కి కూడా చేరొచ్చు.17,330 దిగువకు వస్తే వెయిట్‌ చేయండి. వెంటనే కొనుగోలు చేయొద్దు. దిగువ స్థాయిలో స్ట్రిక్ట్‌ స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయండి. నిఫ్టికి ఇవాళ కీలక స్థాయి 17,350 ఈ స్థాయిని దాటితే నిఫ్టి 17,400ని దాటే అవకాశముంది. 17,400-17,415 మధ్య అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. సో… నిఫ్టి బలహీనంగా మొదలై.. కోలుకుంటే 17,275 నుంచి 17,415 మధ్య నిఫ్టి కదలాడే అవకాశముంది. విదేశీ ఇన్వెస్టర్ల మద్దతు కొనసాగే వరకు నిఫ్టిలో భారీ ఒత్తిడి అనుమానమే. రిలయన్స్‌ షేర్‌ను వాచ్‌ చేయండి. జియో నెక్ట్స్‌ ఫోన్‌ విడుదల వాయిదా ప్రభావం ఆ కౌంటర్‌పై ఉంటుందేమో గమనించండి.