For Money

Business News

నిఫ్టి: దిగువస్థాయిలో అందిన మద్దతు

ఆల్గో ట్రేడర్స్‌ ఊహించినట్లే దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు లభించింది. 17,300 పైన కాస్సేపు నిలదొక్కుకునేందుకు నిఫ్టి ప్రయత్నించినా…17,270ని తాకిన తరవాత కోలుకుంది. ఇవాళ బ్యాంక్‌ నిఫ్టిపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభమైన గంటకే ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 17,269ని తాకిన నిఫ్టి మిడ్‌ సెషన్‌కల్లా దాదాపు నష్టాలన్నీ భర్తీ చేసుకుంది. అయితే యూరోపియన్‌ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా… నిఫ్టి నష్టాల్లోనే ముగిసింది. 2.30 గంటల ప్రాంతంలోనిఫ్టి గ్రీన్‌లోకి వచ్చిన నిలబడలేదు. క్రితం ముగింపుతో పోలిస్తే ఏడు పాయింట్ల నష్టంతో 17,362 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి కూడా దాదాపు అర శాతం నష్టంతో ముగిసినా.. మిడ్‌ క్యాప్‌ సూచీ 0.34 శాతం లాభంతో ముగియడం విశేషం. నిఫ్టి లూజర్స్‌లో రిలయన్స్‌ టాప్‌లో ఉంది. నిఫ్టి సూచీ నష్టాల్లో ముగిసినా 34 షేర్లు లాభాల్లో ముగియడం విశేషం.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
కోల్‌ ఇండియా 154.70 4.07
హిందాల్కో 478.70 3.27
టీసీఎస్‌ 3,847.80 1.49
భారతీ ఎయిర్‌టెల్‌ 695.20 1.32
హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,212.70 1.18

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
రిలయన్స్‌ 2,374.65 -2.10 ఐసీఐసీఐ బ్యాంక్‌ 709.80 -1.45
ఎం అండ్ ఎం 743.30 -0.99
అదానీ పోర్ట్స్‌ 742.55 -0.95
హిందుస్థాన్‌ లీవర్‌ 2,787.20 -0.83