For Money

Business News

ఆఫీస్‌ స్పేస్‌కు భారీ డిమాండ్‌

కొవిడ్‌ సమయంలోనూ ఆఫీస్‌ స్పేస్‌కు మంచి డిమాండ్‌ కన్పిస్తోంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణ భారత్‌లోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉందని రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ పేర్కొంది. ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం… 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2.13 కోట్ల చదరపు అడుగుల (SFT) ఆఫీస్‌ స్పేస్‌ లీజుకు సంబంధించిన లావాదేవీలు జరిగాయి. అందులో 66 శాతం (1.40 కోట్ల SFT) ఆఫీస్‌ స్పేస్‌ లీజు లావాదేవీలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో జరిగినట్లు పేర్కొంది. కొత్తగా అందుబాటులోకి వచ్చే ఆఫీసు స్పేస్‌పరంగా చూసినా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ మిగతా నగరాలతో పోలిస్తే ముందున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 4.02 కోట్ల SFTకార్యాలయ స్థలం కొత్తగా అందుబాటులోకి వచ్చింది. అందులో 63 శాతం (2.55 కోట్ల SFT) ఈ మూడు నగరాల్లోనే నమోదైంది. డిమాండ్‌తో పాటు ఆఫీస్‌ స్పేస్‌ రెంటల్స్‌ వృద్ధి రేటు విషయంలోనూ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ ముందున్నాయి. బెంగళూరులో SFTకి ఆఫీస్‌ స్పేస్‌ లీజు నెలవారీ అద్దె రూ.67 నుంచి రూ.77కు, చెన్నైలో రూ.54 నుంచి రూ.60కి, హైదరాబాద్‌లో రూ.51 నుంచి రూ.57కు పెరిగినట్లు ఆన్‌రాక్‌ పేర్కొంది.