రత్నదీప్ పబ్లిక్ ఇష్యూకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రీటైల్ స్టోర్ చైన్ రత్నదీప్ రీటైల్ త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రానుంది. కంపెనీ పబ్లిక్ ఆఫర్ ప్రతిపాదనకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఆఫర్ తేదీలను, ధరల శ్రేణిని కంపెనీ ప్రకటించనుంది. మార్కెట్ నుంచి రూ. 400 కోట్లను తాజా షేర్ల జారీ ద్వారా కంపెనీ సమీకరించనుంది. అలాగే ఈ ఆఫర్ కింద 1.49 కోట్ల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనున్నారు. ప్రమోటర్లు సందీప్ అగర్వాల్ 85.44 లక్షల షేర్లు, మనీస్ భర్తియా 31.57 లక్షలు, మితేష్ భర్తియా 31.57 లక్షల షేర్లను అమ్ముతారు. ఇష్యూ ద్వారా వచ్చే నిధుల్లో రూ. 40 కోట్లను రుణాలను తిరిగి చెల్లించేందుకు, మిగిలిన మొత్తాన్ని అంటే రూ. 360 కోట్లను దేశ వ్యాప్తంగా కొత్త స్టోర్స్ ఏర్పాటుకు వినియోగిస్తారు. రత్నదీప్‌తో పాటు నేషనల్ మార్ట్ పేరుతో ఈ కంపెనీ స్టోర్లను తెరవనుంది. ప్రస్తుతం ఈ కంపెనీకి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో 190 స్టోర్లను నిర్వహిస్తోంది. రత్నదీప్, రత్నదీప్ సెలెక్ట్, నేషనల్ మార్ట్‌తో పాటు RD Click ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా హోమ్ డెలివరీ సర్వీసులను ఈ కంపెనీ అందిస్తోంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 2,227 కోట్ల టర్నోవర్‌పై రూ. 36.70 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2024తో పోలిస్తే రెండేళ్ళలో కంపెనీ ఆదాయం, నికర లాభం రెట్టింపు కావడం విశేషం. కంపెనీ నెట్‌వర్త్ రూ. 136 కోట్లు కాగా, కంపెనీ వద్ద రూ. 125 కోట్ల రిజర్వులు ఉన్నాయి. కంపెనీ ప్రస్తుత ఈక్విటీ 10.92కోట్ల షేర్లు.
