స్థిరంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు
ప్రపంచ మార్కెట్లకు భిన్నంగా మన మార్కెట్లు నిలకడగా ముగిశాయి. వీక్లీ డెరివేటివ్స్ ముగింపు కావడంతో మిడ్ సెషన్ సమయంలో , చివర్లో గ్రీన్‌లో ఉన్నా… రోజులో చాలా సమయంలో నిఫ్టి రెడ్‌లోనే ఉంది. మిడ్ సెషన్‌కు ముందు 17,379 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకినా.. ఇవాళ్టి మద్దతు స్థాయి 17,302ని కూడా తాకింది. ఒకింతకు డే ట్రేడర్లకు స్వల్ప లాభాలైతే దక్కాయి. పొజిషనల్ ట్రేడర్స్‌కు పెద్ద ప్రయోజనం లేదు. గత ముగింపుతో పోలిస్తే 16 పాయింట్ల లాభంతో 17,369 పాయింట్ల వద్ద నిఫ్టి ముగిసింది. బ్యాంక్ నిఫ్టితో పాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీ కూడా నామమాత్రపు నష్టాల్లో ముగిసింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఓఎన్జీసీ 122.15 2.69
భారతీ ఎయిర్టెల్ 685.45 2.64 నెస్లే ఇండియా 20,350.05 2.57
హిందాల్కో 463.25 1.52
గ్రాసిం 1,596.00 1.22
నిఫ్టి టాప్ లూజర్స్
ఎస్బీఐ లైఫ్ 1,174.00 -3.77
హెచ్డీఎఫ్సీ లైఫ్ 736.00 -1.03
టైటాన్ 2,035.00 -1.02
అల్ట్రాటెక్ సిమెంట్ 7,929.95 -0.79
బజాజ్ ఆటో 3,699.80 -0.69