For Money

Business News

ఐబీఎం ఆర్డర్‌తో 15% జంప్‌

హైదరాబాద్‌కు చెందిన బ్లూక్లౌడ్‌ సాఫ్ట్‌టెక్‌ సొల్యూషన్స్‌ షేర్‌ ఇవాళ 15 శాతం లాభంతో రూ.22.98 వద్ద ట్రేడవుతోంది. డేటా సెంటర్ల రంగంలో నిమగ్నమైన ఈ కంపెనీకి అమెరికా కంపెనీ ఐబీఎం క్లౌడ్‌ నుంచి కీలక ఆర్డర్‌ లభించింది. ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డిజైన్‌, డిప్లాయ్మెంట్‌, సపోర్ట్‌ సర్వీస్‌లను తమ అమెరికా అనుబంధ కంపెనీ గ్లోబల్‌ ఇంపెక్స్‌ ఇన్‌కార్పొరేటెడ్‌ అందిస్తుందని బ్లూక్లౌడ్‌ సాఫ్ట్‌టెక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. ఈ కాంట్రాక్ట్‌ విలువ (ఫిక్సెడ్‌ ఫీజు) రూ. 147 కోట్లుగా కంపెనీ పేర్కొంది. తాజా ఆర్డర్‌తో కంపెనీ వద్ద ఉన్న ఆర్డర్ల విలువ రూ. 1చ400 కోట్లను దాటనుందని కంపెనీ పేర్కొంది. త్రైమాసిక ఆపరేటింగ్‌ మార్జిన్స్‌ కూడా 12.26 శాతం నుంచి 20.38 శాతానికి పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.

Leave a Reply