మళ్ళీ పెరిగిన సిగరెట్ల ధరలు
తాను ఉత్పత్తి చేసే సిగరెట్లలో కొన్నింటి ధరలను ఐటీసీ పెంచింది. గత ఫిబ్రవరిలో ధరలు పెంచిన కంపెనీ ఇపుడు మళ్ళీ కీలక బ్రాండ్ల ధరలను పెంచింది. గత ఫిబ్రవరిలో రూ. 15 ఉన్న ఐటీసీ క్లాసిక్ కనెక్ట్ సిగరెట్ ధరను రూ. 19.5లకు పెంచారు. ఇపుడు దీన్ని మరో పది శాతం పెంచి రూ. 21.4 చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇక 20 సిగరెట్లు ఉన్న ప్యాక్ ధర రూ. 390 నుంచి ఏకంగా రూ. 428కి అంటే రూ. 38 చొప్పున పెంచారు. అలాగే గోల్డ్ ఫ్లాక్ సూపర్ స్టార్ ధరను గత ఫిబ్రవరిలో రూ. 59 నుంచి రూ. 79 చేశారు. ఇపుడు మరో 12.6 శాతం పెంచి రూ. 89 చేశారు. గత ఫిబ్రవరిలో బడ్జెట్‌లో పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ 40 శాతానికి పెంచడంతో కంపెనీ సిగరెట్ల ధరలను పెంచింది. పన్నులను దృష్ట్యానే ధరలు పెంచినట్లు కంపెనీ వర్గాలు అంటున్నాయి. దీంతో కంపెనీ షేర్ ఇవాళ ఇంట్రాడేలో 2 వాతం పెరిగి రూ. 258ని టచ్ చేసింది.
