15 నుంచి యూపీఐ బాదుడు
వచ్చే నెల 15 నుంచి యూపీఐ పేమెంట్స్‌పై చార్జీలు విధించనున్నారు. రూ.2000లోపు చార్జీలు ఉండవని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన కొన్ని గంటల్లోనే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. రూ. 2000 మించిన లావాదేవీలపై విధించే మర్చంట్ డిస్కౌంట్ రేటును (MDR) రేట్ల వివరాలు వెల్లడించింది. వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలకు చార్జీలు ఉండవు. అయితే వ్యక్తులకు, వ్యాపారస్థుల మధ్య జరిగే లావాదేవీలు గనుక రూ.2వేలు దాటితే 0.4 శాతం ఛార్జీ వర్తిస్తుందని NPCIస్పష్టంచేసింది. ఎండీఆర్ ఛార్జీల నుంచి చిన్న వ్యాపారులను కూడా మినహాయించినట్లు NPCI పేర్కొంది. మినహాయించింది. ఎండీఆర్ చార్జీలు కూడా గరిష్ఠంగా రూ. 300 దాటకూడదని పేర్కొంది. నెలకు రూ.లక్ష వరకు బ్యాంక్ ఖాతాలోకి క్యూఆర్ కోడ్ ద్వారా స్వీకరించే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ వర్తించదని స్పష్టంచేసింది. రైల్వేలు, టెలికాం సేవలు, బీమా, ఇంధనం వంటి నిర్దిష్ట విభాగాల విషయంలో మాత్రం లావాదేవీ రూ.2,000 దాటే పక్షంలో ఒక్కో లావాదేవీకి ఫ్లాట్‌గా రూ.5 ఎండీఆర్ చెల్లిస్తే సరిపోతుంది. ఇపుడు జరుగుతున్న యూపీఐ లావాదేవీల్లో 95 శాతం రూ.2,000 లోపే ఉన్నాయని NPCI పేర్కొంది. రూ. 2000 దాటినా రూ. 3000 వరకు లావాదేవీలపై పడే ఎండీఆర్ చార్జీ రూ.12 ఉంటుంది, అదే రూ. 50,000 వరకు రూ. 200 అవుతుందని NPCI తెలిపింది. రూ. 75000 దాటే పక్షంలో గరిష్ఠంగా రూ. 300 చార్జీ విధిస్తారు.
