రాజమౌళి, మహేబాబుకు SIR నోటీసులు
సర్‌లో భాగంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ప్రముఖ నటుడు మహేష్‌బాబుతో పాటు క్రీడాకారులు వీవీఎస్ లక్ష్మణ్, సైనా నెహ్వాల్‌కు ఎన్నికల సంఘం నుంచి నోటీసులు అందాయి. క్రీడాకారుడు గోపీచంద్, మహేష్ బాబు భార్య నమ్రత, నటుడు వెంకటేష్, ఆయన ఇద్దరు కుమార్తెలకు కూడా నోటీసులు అందినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక పేర్కొంది. నటి సమంత, నటుడు దేవరకొండ విజయ్ కూడా నోటీసులు జారీ అయినట్లు తెలిపింది. చాలా వరకు పేర్లలో పొరపాట్లు, 2002 సర్ ప్రక్రియలో వీరి పేర్లు లేనందున ఈ నోటీసులు జారీ చేసినట్లు ఆ పత్రిక వెల్లడించింది. 2002 నాటి ఓటర్ల జాబితా, ప్రస్తుత ఓటర్ల జాబితాలో తేడాలు ఎందుకు ఉన్నాయన్న కాలమ్‌లో వీరు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ప్రతిక వెల్లడించింది. సర్ నోటీసులు పొందినవారిలో నటుడు రామ్ చరణ్ భార్య, ప్రముఖ పారిశ్రామికవేత్త ఉపాసన కొణిదల కూడా ఉన్నారు. వీవీఐపీలు అందుబాటులో లేని పక్షంలో.. వారి తరఫున మరో వ్యక్తి హాజరై వివరణ ఇవ్వొచ్చని ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు. ప్రముఖలు ఎవరూ ఇంకా హాజరు కాలేదని హైదరాబాద్ జిల్లా ఎన్నికల ఆఫీసర్ ఆర్వీ కర్ణన్ తెలిపారని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మ్యాపింగ్ పొరపాట్లు చాలా జరిగాయని ఓటర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నట్లు పత్రిక వెల్లడించింది. బూత్ లెవల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా పలుచోట్ల డేటా సరిగ్గా ఎంటర్ కాలేదని తెలుస్తోంది.
