For Money

Business News

అన్నీ బాగున్నాయి… మన నిఫ్టినే

ప్రపంచ మార్కెట్లన్నీబాగున్నాయి. గత శుక్రవారం వాల్‌స్ట్రీట్‌ నష్టాల్లో ముగిసినా.. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. కోప్సీ మూడు శాతంపైగా లాభంతో ఉంది. శుక్రవారం పెరిగిన డాలర్‌ ఇపుడు స్వల్పంగా తగ్గింది. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు బాగా తగ్గే ఛాన్స్‌ ఉంది. డాలర్లను భారీ ఎత్తున సమీకరించడంతో మన మార్కెట్‌లో USD INR ఇప్పట్లో పెరిగే ఛాన్స్‌ లేదు. దీంతో రూపాయి బలంగా ఉంటోంది. అయితే ఈక్విటీ మార్కెట్లలో మాత్రం బలమైన రూపాయి ప్రభావం పెద్దగా చూపడం లేదు. హార్ముజ్‌లో మళ్ళీ అమెరికా, ఇరాన్‌ మధ్య దాడులు పెరగడంతో బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు వంద డాలర్ల వైపు పరుగులు పెడుతోంది. ఒపెక్‌ కూడా ఉత్పత్తికి సంబంధం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మన మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. అయితే దిగువస్థాయిలో ఏమైనా మద్దతు అందుతుందేమో చూడాలి. అనలిస్టులు మాత్రం 23,500 ప్రాంతంలో మద్దతు ఉందని అంటున్నారు. ఇవాళ కూడా ఐటీ షేర్లలో అమ్మకాలు ఉంటాయిన అనలిస్టులు అంటున్నారు. పలు బ్రోకింగ్‌ సంస్థలు ఐటీ షేర్లలో లాభాలు స్వీకరించమని సలహాలు ఇస్తున్నారు. దీంతో ఇవాళ ఐటీ షేర్లలో ఒత్తిడి ఉండొచ్చు. ఫార్మాలో కూడా పెద్ద ఉత్సాహం లేదు. రూపాయి బలం ఈ కౌంటర్లను ప్రభావితం చేస్తోంది. ఇక బ్యాంకింగ్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి వ్యాపార నిర్ణయాలు, పరిణామాలను బట్టి షేర్లపైనే దృష్టి పెట్టడం మంచిది.

Leave a Reply