మళ్ళీ వాటా అమ్మకం
త కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం వరుసగా ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాలను అమ్ముతోంది. వేల కోట్లను జమ చేసుకుంటోంది. తాను కొత్తగా ఓ భారీ పరిశ్రమ పెట్టకున్నా… ఇప్పటికే భారీ లాభాలతో నడుస్తున్న కంపెనీల్లో వాటాను విక్రయించడం ద్వారా వేల కోట్లతో తన ఖజానాను నింపుకుంటోంది. మొన్ననే ఎల్‌ఐసీలో వాటా అమ్మగా, తాజాగా హిందుస్థాన్ కాపర్‌లో ఏకంగా 6 శాతం వాటా అమ్ముతోంది. పైకి మూడు శాతమని చెప్పినా… మరో 3 శాతం గ్రీన్ షూ ఆప్షన్‌కు కూడా అనుమతి ఇచ్చింది. ఇవాళ ఈ కంపెనీ షేర్ రూ. 567.9 వద్ద ముగిసింది. ఈ ధరకు 9.5 శాతం డిస్కౌంట్‌తో రూ. 514కే షేర్లను అమ్ముతోంది. ఇటీవల ఈ షేర్లను కొన్న సాధారణ ఇన్వెస్టర్లకు షాక్ తిన్నారు. ఓఎఫ్‌ఎస్ తరవాత ఈ ధర మళ్ళీ ఎపుడు వస్తుందో అన్న టెన్షన్ సాధారణ ఇన్వెస్టర్లకు ఉంది. ఈ ఏడాది మొత్తానికి ఈ షేర్ 9 శాతం పెరగ్గా, ఇపుడు ఆ లాభమంతా పోయినట్లే. అయితే ఇటీవల మెటల్ షేర్లకు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి త్వరలోనే ఈ షేర్ సాధారణ స్థితికి రావొచ్చని అనలిస్టులు అంటున్నారు. ఈ ఆఫర్‌లో రీటైల్ ఇన్వెస్టర్లకు కేవలం 10 శాతం కేటాయించారు. మిగిలిన 90 శాతాన్ని సంస్థాగత ఇన్వెస్టర్లకు అమ్ముతారు.
