బ్రేకౌట్‌కు రెడీనా?
మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇపుడు 51 పాయింట్ల లాభంలో 24,304 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. రేపు నిఫ్టి మంత్లీ డెరివేటివ్స్ క్లోజింగ్స్ ఉండటంతో నిఫ్టి ఏ స్థాయిలో క్లోజ్ అవుతుందో అన్న టెన్షన్ మార్కెట్‌లోఉంది. ఓపెన్ ఇంటరెస్ట్ చూస్తే మాత్రం రేపటి లోగా నిఫ్టి 24400 దాటే ఛాన్స్ కన్పించడం లేదు. తొలుతు 24300 పుట్స్‌ను జీరో చేస్తారా లేదా 24400 కాల్స్‌ను జీరో చేస్తారా అన్న చర్చ మార్కెట్‌లో ఉంది. లేదా 24350 మధ్య నిఫ్టిని ఉంచితే రెండూ జీరోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మరోవైపు గత కొన్ని రోజులుగా హయ్యర్ హైస్, లోయర్ లోస్ వద్ద క్లోజ్ అవుతున్న నిఫ్టి… త్వరలోనే బ్రేకౌట్‌కు సిద్ధంగా ఉంది. బహుశా సెప్టెంబర్ సిరీస్ ఇదే ట్రెండ్‌తో ప్రారంభం కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. CASలో వచ్చిన మార్పులతో చాలా మంది ఇన్వెస్టర్లు ఆప్షన్స్‌కు దూరంగా ఉంటున్నారు.ముఖ్యంగా డెరివేటివ్స్ క్లోజింగ్‌కు ముందు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇవాళ చాలా వరకు కౌంటర్స్ గ్రీన్‌లో ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ లిస్టింగ్ నేపథ్యంలో చాలా మంది ఇన్వెస్టర్లు BSE కౌంటర్‌ను గమనిస్తున్నారు. ఈ షేరకు ూ. 3300 వద్ద కీలకంగా మారుతోంది. ఈ స్థాయిలో ఇప్పటికే చాలా సార్లు ప్రతిఘటన వచ్చింది. మరోవైపు 3200 స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఇవాళ రూ. 65 లాభంతో ట్రేడవుతోంది.
