బాండ్ ఆశలు ఆవిరి
ట్రెజరీ బాండ్లను బై బ్యాక్ చేస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేసిన ప్రకటన ఉత్సాహం కేవలం ఒక సెషన్‌కే పరిమితమైంది. రాత్రి బాండ్ ఈల్డ్స్ మళ్ళీ పెరిగాయి. డాలర్ ఇండెక్స్ కూడా పుంజుకుంది. దీంతో వాల్‌స్ట్రీట్ భారీ నష్టాలతో ముగిసింది. ముఖ్యంగా వాల్‌మార్ట్ ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహపర్చింది. డౌజోన్స్ ఏకంగా 1.32 శాతం నష్టంతో ముగిసింది. నాస్డాక్ కూడా ఒక శాతం క్షీణించింది. ఇరాన్‌ను ఆర్థికంగా దిగ్భంధం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 94 డాలర్లకు చేరింది. అలాగే బంగారంలో ర్యాలీ కొనసాగింది. ముఖ్యంగా వెండి ధరలు జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతున్నాయి.
