మళ్ళీ టెన్షన్ మొదలు
ఏడు సెషన్స్ వరుస నష్టాల తరవాత నిన్న గ్రీన్‌లో ముగిసింది మార్కెట్. నిన్న సెన్సెక్స్ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కారణంగా షార్ట్ కవరింగ్ కూడా వచ్చింది.అయితే రాత్రికి రాత్రి అమెరికాలోసీన్ మారిపోయింది. బాండ్ ఈల్డ్స్ మళ్ళీ పెరగడంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గిఫ్ట్ నిఫ్టి స్వల్ప లాభాల్లో ఉంది. మరి నిఫ్టి ఈ లాభాల నుంచి కోలుకుంటుందా లేదా నష్టాల్లో జారుకుంటుందా అన్న టెన్షన్ మార్కెట్లో మొదలైంది. మంగళారం మంత్లి డెరివేటివ్స్ ముగింపు ఉండటంతో … క్యాష్ మార్కెట్ కూడా ప్రభావితం అవుతుంది. ఆగస్టు నెలలో విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో పెట్టుబడులు పెంచినట్లు తేలింది. ముఖ్యంగా ఫైనాన్షియల్స్,
ఆటో, హెల్త్‌కేర్, ఐటీలో వీరు పెట్టుబడి పెట్టారు. ఈ సెంటిమెంట్ కొనసాగుతుందో లేదో చూడాలి. మరోవైపు నిన్న చక్కెర షేర్లు భారీగా లాభపడ్డాయి. ప్రధాన షేర్లు 20 శాతం దాకా లాభాలు ఆర్జించాయి. అయితే ప్రభుత్వం పది లక్షల టన్నుల ముడి చక్కెర దిగుమతికి నిన్న అనుమతి ఇచ్చింది. ఎలాంటి డ్యూటీ లేకుండా దీన్ని దిగుమతి చేసుకోనున్నారు. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో చక్కెర ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మరి దీని ప్రభావం చక్కెర షేర్లపై ఎలా ఉంటుందో చూడాలి.
