మార్గదర్శికి క్లీన్‌చిట్
మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. గతంలో మార్గదర్శికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హైకోర్టును ఉండవల్లి సుప్రీం కోర్టులో సవాలు చేశారు. దీనిపై ఇవాళ జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలేతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, నాగముత్తు వాదనలు వినిపిస్తూ…. డిపాజిట్‌దారులకు ఇప్పటి వరకు రూ.2,500 కోట్లు మార్గదర్శి వెనక్కి ఇచ్చేసినట్లు తెలిపారు. క్లెయిమ్ చేయని మరో రూ.5.23 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మొత్తాన్ని ఇప్పటికే ఎస్క్రో అకౌంట్‌లో జమ చేసిన విషయాన్ని కోర్టులో ప్రస్తావించారు. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మార్గదర్శి వ్యవహారంపై పిటిషన్ వేయడానికి, పోరాటం చేయడానికి మీరెవరని ఉండవల్లిని ప్రశ్నించింది. ఈ కేసు మీ వ్యక్తిగత వివాదంగా కనిపిస్తోందే తప్ప…. ఎలాంటి అంశాలు కనిపించడం లేదని జస్టిస్ ఎంఎం సుందరేశ్ వ్యాఖ్యానించారు. ఇరువైపుల వాదనల అనంతరం.. ఉండవల్లి పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
