For Money

Business News

ట్రెండ్‌లైన్‌ వద్ద సపోర్ట్‌

టెక్నికల్‌ అనలిస్టులు అంచనా వేసినట్లు ట్రెండ్‌లైన్‌ వద్ద నిఫ్టికి ఇవాళ మద్దతు లభించింది. ట్రెండ్‌లైన్‌ స్థాయి 24050ని నిన్న నిఫ్టి తాకింది. అలాగే బ్యాంక్‌ నిఫ్టికి కూడా గట్టి మద్దతు లభించింది. అనూహ్యంగా ఐటీ షేర్లకు వచ్చిన మద్దతు కారణంగా నిఫ్టి చక్కటి లాభాలతో ముగిసింది. 24,184 స్థాయిని తాకినా… 153 పాయింట్ల లాభంతో 25231 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ అనేక రంగాల షేర్లకు మద్దతు లభించింది. ఫైనాన్షియల్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు రాణించాయి. ముఖ్యంగా స్మాల్‌ క్యాప్‌ షేర్ల సూచీ ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. గత కొన్ని రోజులుగా భారీగా క్షీణించిన ఆల్ఫా నిఫ్టి కూడా ఇవాళ అర శాతంపైగా లాభంతో ముగిసింది. పలు బ్యాంకు షేర్లు ఉదయం బాగా లాభాలు గడించినా… లాభాల స్వీకరణ కారణంగా స్వల్ప నష్టాలకే పరిమితమయ్యాయి. మొత్తానికి వరుసగా ఏడు రోజుల నష్టాలకు ఇవాళ బ్రేక్‌ పడటం విశేషం. ఆగస్టు నెలలో చివరి డెరివేటివ్స్‌ సెషన్‌ లాభాలతో ప్రారంభం కావడం విశేషం. వచ్చే గురువారం నిఫ్టి ఆగస్టు నెలవారీ డెరివేటివ్స్‌ ముగింపు ఉన్నందున… రేపు ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి. ఎందుకంటే నిఫ్టి గ్రీన్‌లో ఉన్నా… మార్కెట్‌లో క్రూడ్‌ గుబులు కొనసాగింది. అనూహ్యంగా 94 డాలర్ల ప్రాంతంలో బ్రెంట్‌ ట్రేడవుతోంది. ఇక సెన్సెక్స్‌ విషయానికొస్తే… 77,468 పాయింట్ల వద్ద ప్రారంభైన ఈ సూచీ ఇంట్రాడేలో 77,611 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివర్లో లాభౄల స్వీకరణ వచ్చినా 628 పాయింట్ల లాభంతో 77,537వద్ద ముగిసింది.
నిఫ్టి టాప్‌ గెయినర్స్‌: ETERNAL, SHRIRAMFIN, KOTAKBANK, ITC, BAJFINANCE
నిఫ్టి టాప్‌ లూజర్స్‌ : TATACONSUM, HINDALCO, INDIGO, NESTLE IND, HCLTECH

Leave a Reply