సినిమా టికెట్లకు కొత్త ధరలు
తెలంగాణలో సినిమా థియేటర్ల టికెట్ రేట్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. నాన్ ఏసీ, ఏసీ థియేటర్లతోపాటు స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ల ధరలను పెంచారు. ధరల్లో మార్పులు ఇలా ఉన్నాయి
1. నాన్ ఏసీ థియేటర్లు : నాన్ ప్రీమియం టికెట్ల కనిష్ఠ ధరూ. రూ.30. గరిష్ఠ ధర రూ.70. ఇక ప్రీమియం టికెట్ల కనిష్ఠ ధర రూ.50 కాగా, గరిష్ఠ ధర రూ.100.
2. ఏసీ థియేటర్లలో.. నాన్ ప్రీమియం టికెట్ల ధర కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.150గా నిర్ణయించారు. ఇక ప్రీమియం టికెట్ల ధర కనిష్ఠంగా రూ.100 కాగా, గరిష్ఠ ధర రూ.200.
3. స్పెషల్ థియేటర్లలో.. నాన్ ప్రీమియం టికెట్ల ధర కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250గా నిర్ణయించారు. ప్రీమియం రిక్లయినర్లకు కనిష్ఠంగా రూ.200 కాగా , గరిష్ఠ ధర రూ.300.
4. మల్టీప్లెక్స్ విషయానికొస్తే రెగ్యులర్ టికెట్ల ధర కనిష్ఠంగా రూ.100, గరిష్ఠ ధర రూ.250గా నిర్ణయించారు. రిక్లయినర్లకు కనిష్ఠ ధర రూ.200, గరిష్ఠ ధర రూ.300.
