For Money

Business News

జోరుగా ఆల్ఫా దెబ్బ….

వరుసగా ఏడో సెషన్‌లోనూ నిఫ్టి నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి చివరిదాకా నష్టాలతో కొనసాగింది. కనిష్ఠ స్థాయి నుంచి 50 పాయింట్లు లాభపడి 24078 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 77 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టి ఆల్ఫాలో ఇవాళ భారీ ఒత్తిడి కన్పించింది. ఈ సూచీ 1.2 శాతం నష్టపోయింది. ఉదయం దిగువ స్థాయిలో మద్దతు లభించినా… మిడ్‌ సెషన్‌ తరవాత మళ్ళీ పడటం మొదలైంది. ఉదయం కనిష్ఠ ధరతో పోలిస్తే వంద పాయింట్లు రికవరైన ఆల్ఫా నిఫ్టి చివరల్లో 79 పాయింట్ల నష్టంతో ముగిసింది. ముఖ్యంగా ఇవాళ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల్లో అనూహ్య ఒత్తిడి కన్పించింది. నిన్నటి లాభాలన్నీ ఇవాళ తుడుకు పెట్టుకుపోయాయి. ఐటీ మినహా మిగిలిన రంగాల సూచీల్లో ఒత్తిడి కన్పించింది. కోప్సీ పడినపుడుల్లా మన ఐటీ పెరుగుతాయి. అదే ఫార్ములాతో నిఫ్టి ఐటీ ఇవాళ 0.7 శాతం లాభంతో క్లోజైంది. రేపు నిఫ్టి 24000 స్థాయిని కాపడుకుంటుందేమో చూడాలి.

Leave a Reply