For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మండి

పలు బ్రోకరేజీ సంస్థల అంచనా ప్రకారం నిఫ్టి డిసెంబర్‌కల్లా 17,500 ప్రాంతానికి చేరొచ్చు. అంటే మనం ఇక 200 పాయింట్ల దూరంలో ఉన్నాం. మరి అప్పటి వరకు ఏం జరుగుతుంది. చాలా వరకు నిఫ్టిలో కన్సాలిడేషన్‌ జరిగే అవకాశముంది. కాబట్టి నిఫ్టి పెరిగినపుడల్లా అమ్మి.. స్వల్ప లాభంతో బయటపడటం తప్ప… భారీ లాభాలు ఆశించడం కష్టమే. నిఫ్టి క్రితం ముగింపు 17,323. సింగపూర్‌ నిఫ్టి స్థాయిలో ప్రారంభమౌతే… నిఫ్టి తొలి ప్రతిఘటన స్థాయికి చేరినట్లే. సో.. నిఫ్టి 17360, 17,380 స్థాయిలకు చేరుతుందేమో చూడండి. 17400 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. నిఫ్టి గనుక17,410 దాటితే అమ్మొద్దు. నిఫ్టి 17,470 దాకా వెళ్ళొచ్చు. కాబట్టి నిఫ్టి స్థాయిలను చూసి, మీ రిస్క్‌ కెపాసిటీని బట్టి 17400 స్టాప్‌లాస్‌తో అమ్మండి. నిఫ్టికి ఇవాళ కీలక స్థాయి 17,290 ఈ స్థాయికి వస్తే లాభాలు స్వీకరించండి. లేదా నిఫ్టి గనుక ఆరంభంలోనే ఈ స్థాయికి వస్తే 17,270కు వస్తుందేమో చూడండి. వస్తే 17250 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. ఇరువైపులా ఛాన్స్‌ ఉంది. ఏ ఛాన్స్‌ తొలుత వస్తుందో చూడండి. నిఫ్టిలో ఇపుడు ట్రేడ్‌ చేయాలంటే భారీ పెట్టుబడి అవసరం. లాభమైనా, నష్టమైనా క్షణాల్లో భారీగా ఉంటుంది. దీనికి కారణం నిఫ్టి అధిక స్థాయిలో ఉండటం. కాబట్టి స్టాప్‌లాస్‌ ఎలాంటి సమయంలోనూ మర్చిపోవద్దు.