For Money

Business News

ఈ కేఫ్‌ విలువ రూ. 1,800 కోట్లు!

ఇరానీ చాయ్‌, బన్‌ మస్కాతో ఫేమస్‌ అయిన నీలోఫర్‌ కేఫ్‌ మరింతగా విస్తరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించాలని నిర్ణయించింది. ఈ పనిని ప్రైస్‌వాటర్‌ కూప్స్‌, ద రెయిన్‌ మేకర్‌ గ్రూప్‌ సంస్థలకు అప్పగించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని లక్డికాపుల్‌, రెడ్‌ హిల్స్‌, హియాయత్‌ నగర్‌, బంజారా హిల్స్‌తో పాటు హైటెక్‌ సిటీలలో కేఫ్‌లను నిర్వహిస్తోంది. గత ఏడాది ఈ కేఫ్‌ రూ. 205.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అలాగే దీనిపై రూ. 7.8 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు వెల్లడించింది. దీని ఆధారంగా కేఫ్‌ విలువ రూ. 1500 కోట్ల నుంచి రూ. 1800 కోట్ల వరకు ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఇటీవల పలు విదేశీ ఇన్వెస్టర్లు దక్షిణాదిలో విద్య, వైద్య సంస్థలో పాటు కేఫ్‌, రెస్టారెంట్లలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్యారడైజ్‌లో కూడా ఇన్వెస్ట్‌ చేశారు. త్వరలోనే ప్యారడైజ్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఈ నేపథ్యంలో కేఫ్‌ నీలోఫర్‌ వ్యాల్యుయేషన్‌ కూడా ఆకర్షణీయం ఉండే ఛాన్స్‌ ఉంది.

Leave a Reply