For Money

Business News

రోల్స్‌ రాయిస్‌తో RIL డీల్‌

అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (AMCA) కార్యక్రమం కింద స్వదేశీ యుద్ధ విమాన ఇంజిన్‌ను తయారు చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించింది. ఈ మేరకు బ్రిటన్‌ కంపెనీ రోల్స్-రాయిస్‌తో జతకట్టింది. దేశంలో ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసే అంశాన్ని తాము పరిశీలిస్తున్నట్లు రెండు కంపెనీలు ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ కేంద్రం ద్వారా యుద్ధ విమాన ఇంజిన్ల డిజైన్, అభివృద్ధి, తయారీ, టెస్టింగ్, ఉత్పత్తి, నిర్వహణ వంటి అన్ని కార్యకలాపాలనూ చేపట్టాలని నిర్ణయించాయి.

Leave a Reply