For Money

Business News

మాజీ మంత్రి ఆస్తుల జప్తు

ఏపీ మద్యం కేసులో నిందితుడు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఆయనతో పాటు ఆయన కుమారుడు సునీల్‌ కుమార్‌, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద జప్తు చేసింది. ఈ మేరకు ఈనెల 6వ తేదీ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో హైదరాబాద్‌, ఖాజాగూడ, కోకాపేటలో ఉన్న భూములు కూడా ఉన్నాయి. లగ్జరీ కార్లు, వాచీలను కూడా ఈడీ జప్తు చేసింది. జప్తు చేసిన ఆస్తుల విలువ రూ. 37.7 కోట్లని తెలుస్తోంది. మద్యం స్కామ్‌లో అక్రమంగా ఆర్జించిన మొత్తానికి సమానమైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జప్తు చేసిన ఆస్తుల మార్కెట్‌ విలువ చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అనకాపల్లి జిల్లాలో కారుమూరికి చెందిన గ్రానైట్‌ క్వారీ, గుర్గామ్‌లోని ఎలాన్‌ ప్యారడైజ్‌ వద్ద ఉన్న ఓ కమర్షియల్‌ ప్రాజర్టీని కూడా ఈడీ జప్తు చేసింది. అలాగే ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లోని ఓ ఫ్లాట్‌ కూడా జప్తు చేసిన ఆస్తుల్లో ఉంది. వీటితో పాటు పిక్సెడ్‌ డిపాజిటల్ఉ, వోల్వో, టయోట ఫార్చునర్‌, లగ్జరీ వాచీలను కూడా జప్తు చేసింది. విజిలెన్స్‌ రిపోర్టు ఆధారంగా గత ఫిబ్రవరి 10వ తేదీన ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.

Leave a Reply