For Money

Business News

ఐటీ ఆదుకునేనా?

గత కొన్నేళ్ళుగా పట్టించుకోని ఐటీ రంగమే ఇపుడు భారత మార్కెట్లకు శరణ్యంగా మారింది. అమెరికాలో కూడా చాన్నాళ్ళ తరవాత ఐటీ కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. క్రూడ్‌ ధరలు మళ్ళీ భగ్గుమనడంతో ఇవాళ నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టిపై ఒత్తిడి పెరిగే పక్షంలో ఐటీ షేర్లు ఆదుకుంటాయనే ఆశ మార్కెట్‌లో కన్పిస్తోంది. మరోవైపు ఫలితాలు ప్రకటించన కంపెనీల షేర్ల ధరలను ఇన్వెస్టర్లు గమనిస్తున్నారు. హితాచి ఎనర్జి బంపర్ ఫలితాలు కోర్‌ పవర్‌ సెక్టార్‌ షేర్లకు మళ్ళీ కాస్త బలం రావొచ్చు. అలాగే టైటాన్‌ ఫలితాలతో మళ్ళీ జువలరీ రంగ కంపెనీల షేర్లు మరింత పెరిగే ఛాన్స్‌ ఉంది. హైదరాబాద్‌ కంపెనీలకు సంబంధించి అపోలో మైక్రో షేర్‌ ఫలితాలకు ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి. అలాగే హైదరాబాద్‌కు చెందిన మిడ్‌వెస్ట్‌ ఎనర్జి కూడా ఇవాళ షేర్ల విభజనపై నిర్ణయం తీసుకోనుంది. ముఖ విలువను రూ. 10 నుంచి రూ1కి తగ్గించనున్నారు. అలాగే గ్లాండ్‌ ఫార్మా ఇవాళ వెలుగులో ఉండే అవకాశముంది. ఓ అంతర్జాతీయ కంపెనీతో కుదిరిన డీల్‌ కారణంగా కంపెనీ CMDO రంగంలో దూసుకుపోయే ఛాన్స్‌ ఉంది.

Leave a Reply