అప్పటి దాకా హర్ముజ్ క్లోజ్
తమ డిమాండ్లపై ఇరాన్ మొండి పట్టు వీడటం లేదు. యుద్ధం వల్ల తమకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. తమ రేవులపై ఉన్న నిర్భంధాన్ని తొలగింఆచలని, జప్తు చేసిన సొమ్ము తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. తమ దేశ చుట్టపక్కల ఉన్న బలగాలను ఉపసంహరించాలని ఇరాన్ తాజాగా డిమాండ్ చేసింది. అప్పటి దాకా హర్ముజ్‌ను తెరిచే ప్రసక్త లేదని పేర్కొంది. మరోవైపు సౌదీ అరేబియా రిఫైనరీపై హౌతీల దాడితో ముడి చమురు ధరలు మళ్ళీ భగ్గు మన్నాయి. ఇపుడు బ్రెంట్ క్రూడ్ 85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే ట్రంప్ మాత్రం ఇరాన్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆదేశం పని అయిపోయిందని, తమ సైన్యానికి జీతాలు ఇచ్చే స్థితిలో కూడా ఇరాన్ లేదని ట్రంప్ అంటున్నారు. అపుడపుడు తప్ప ఇరాన్ చర్చల గురించి తాను పట్టించుకోవడం లేదన్నారు. ఇదే సమయంలో ఆయుధాల ఉత్పత్తిని పెంచాలని పెంటగాన్‌కు ట్రంప్ ఆదేశాలు ఇవ్వడం విశేషం.
