For Money

Business News

ఇవాళ్టి లాభాలు నిలుస్తాయా?

మార్కెట్‌ ఇవాళ గ్రీన్‌లో ప్రారంభం కానుంది. గిఫ్ట్‌ నిఫ్టి 55 పాయింట్ల లాభం సూచిస్తోంది. క్యాష్‌, ఫ్యూచర్స్‌ మార్కెట్‌ల మధ్య తేడా ఉండటంతో… ఇపుడు గిఫ్ట్‌ నిఫ్టి మేరకు మార్కెట్‌ ఓపెన్‌ కావడం లేదు. ఇవాళ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉన్నందున … మార్కెట్‌లో ఒత్తిడి వస్తుందేమో చూడాలి. ఒకవేళ వస్తే మద్దతుకు ఛాన్స్‌ ఉందా అన్న అంశంపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. దేశీయంగా పాజిటివ్‌ సంకేతాలు లేవు. ఏఐ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా కోప్సి 5 శాతం దాకా నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో మన ఐటీ షేర్లలో ఆసక్తి కొనసాగే ఛాన్స్‌ ఉంది. ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో ముఖ్యంగా శ్రీరామ్‌ ఫైనాన్స్‌ ఇవాళ వెలుగులో ఉండే అవకాశముంది. బంగారం ధరలు పెరిగినందున ముత్తూట్‌ ఫైనాన్స్‌, మణ్ణప్పురం వంటి షేర్లు గ్రీన్‌లో ఉండొచ్చు. యూపీఏ పేమెంట్స్‌పై చార్జీలు ఖాయం కావడంతో… పేటీఎం షేర్‌లో లాభాలు కొనసాగే ఛాన్స్‌ ఉంది. నిఫ్టికి 24500 ప్రాంతంలో మద్దతు ఉండే ఛాన్స్‌ ఉంది. అలాగే 24650 లేదా 24700 వద్ద ప్రతిఘటన ఎదురయ్యే అవకాశముంది.24400ను స్టాప్‌లాస్‌గా పనిచేసే అవకాశముంది. అధిక స్థాయిలో నిఫ్టిపై అమ్మకాల ఒత్తిడి కూడా వచ్చే ఛాన్స్‌ ఉంది.

Leave a Reply