బులియన్ మళ్ళీ జిగేల్
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్ళీ భారీగా పెరిగాయి. అమెరికా మార్కెట్ డాలర్ ఇండెక్స్ ఏడు నెలల కనిష్ఠానికి పడిపోవడంతో… రాత్రి బంగారానికి డిమాండ్ వచ్చింది. ఒకదశలో అయిదు శాతంపైగా పెరిగింది. ఇవాళ ఉదయం మరో శాతం పెరిగి ఔన్స్ బంగారం ధర 4340 డాలర్లను దాటింది. ఇక వెండి ధర కూడా 62.4 డాలర్లను దాటింది. డాలర్ బలహీనంగా మారడంతో ప్రపంచ వ్యాప్తంగా మెటల్ కౌంటర్లలో నిన్నటి నుంచే డిమాండ్ వస్తోంది. ఇరాన్‌తో అమెరికా ఒప్పందం దాదాపు ఖరారు అయిందన్న వార్తలతో డాలర్ బలహీనపడుతోంది. హార్మోజ్కు సంబంధించి ఒమన్‌తో తాము ఒప్పందం చేసుకున్నట్లు ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. ఇవాళ ఉదయం ఆరంభంలో కూడా మన మార్కెట్లలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.
