For Money

Business News

పునర్‌ వైభవం కోసం మాస్టర్‌ ప్లాన్‌

ప్రపంచ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ దుబాయ్‌ మార్కెట్‌ది ప్రత్యేక స్థానం. ఇక్కడ ధరలు పెరగడమే కాని.. తగ్గే ప్రసక్తే లేదు. ఇది ఇరాన్‌, అమెరికా యుద్ధం మునుపటి సంగతి. గత మూడు నెలలుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఏడాది ఏకంగా రూ. 25 లక్షల కోట్ల రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు జరిపిన దుబాయ్‌ ఈ ఏడాది ఎన్నడూ లేనివిధంగా రివర్స్‌ బిజినెస్‌ చూసింది. గత ఏడాది జరిగిన వ్యాపార లావాదేవీల్లో 22 శాతం భారతీయులవేనని మీడిఆయలో వార్తలు వచ్చాయి. బక్కచిక్కిపోతున్న రూపాయికి దుబాయ్‌ కరెన్సీ ఎమిరేట్‌ దిర్హం హడ్జ్‌గా పనికొస్తోంది. పైగా రెంటల్‌ ఆదాయం కూడా 9 శాతం దాకా ఉంటోంది. దీంతో చాలా మంది దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌వైపు పరుగులు తీశారు. అయితే ఇరాన్‌, అమెరికా యుద్ధం నేపథ్యంలో దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌ అంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్‌ 29 మధ్య కాలంలో కేవలం 26,960 రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార లావాదేవీలు జరిగాయి. గత డాది 2,46,951 లావాదేవీలు జరిగాయి. అంటే ఏకంగా 89 శాతం తగ్గాయన్నమాట. దీంతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి పునర్‌ వైభవం తెచ్చేందుకు దుబాయ్‌ నడుం బిగించింది. పలు ఆకర్షణీయ పథకాలు అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా ఇటీవల తెచ్చిన గోల్డన్‌ వీసా ఇపుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అలాగే రిటైరీ రెసిడెన్సి, ప్రాపర్టీ రెసిడెన్సీలను కూడా ఒక గొడుకు కిందకు తెచ్చారు. ఒక అన్ని రకాల దరఖాస్తులు సింగిల్‌ విండో ద్వారా పరిష్కరిస్తున్నారు. అలాగే రియల్‌ ఎస్టేట్‌ ఆకర్షణీయ వ్యాపారంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మార్చి నెలలో రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు తగ్గడానికి రంజాన్‌ పండుగ ఉండటం, వర్షాకాలం కావడమని దుబాయ్‌ అధికారులు అంటున్నారు. వీసా రూల్స్‌ మార్చడం కూడా రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కు కలిసి వచ్చిన అంశమని అంటున్నారు. ఇప్పటి వరకు రెండేళ్ళ రెసిడెన్సి వీసా కావాలంటే కనీసం రెండు కోట్ల రూపాయల ప్రాపర్టీ కొనాల్సి ఉండేది. ఇపుడు దీన్ని కోటి రూపాయలకు తగ్గించారు. అయితే జాయింట్‌గా కొంటే ప్రతి ఒక ఇన్వెస్టర్‌ పెట్టుబడి కనీసం కోటి రూపాయలు ఉండాలి. ఇప్పటి వరకు అల్ట్రా రిచ్‌పై దృష్టి పెట్టిన దుబాయ్‌ ఇపుడు కీలకమై మధ్య తరగతి ప్రొఫెనల్స్‌పై దృష్టి పెడుతోంది. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు కనసీం ప్రాపర్టీ వ్యాల్యూ తగ్గించడం స్థానిక రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఎంత మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. మరో మూడు లేదా ఆరు మాసాల్లో దుబాయ్‌ మార్కెట్‌ స్థిరత్వం వచ్చే అవకాశముందని భారత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులు అంటున్నారు.

Leave a Reply