ఈ నష్టాలు ఎంత వరకు?
ఇవాళ కూడా నిఫ్టి నష్టాలతో ప్రారంభం కానుంది. గిఫ్ట్ నిఫ్టి ఇప్పటికే 250 పాయింట్ల నష్టంతో ఉంది. వాస్తవానికి ఉదయం 500 పాయింట్ల నష్టంలో ఉన్న గిఫ్ట్ నిఫ్టి చాలా వరకు కోలుకుంది. అయితే ఇవాళ
నిఫ్టి మార్చి నెలవారీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది. దీంతో ఉదయం మార్కెట్‌పై ఒత్తిడి మరింత పెరుగుతుందోమో చూడాలి. అలాగే రోల్ ఓవర్స్ కూడా చూడాల్సి ఉంటుంది. రేపు మార్కెట్లకు సెలవు. అలాగు శుక్రవారం కూడా. అంటే ఈ వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే ట్రేడింగ్ ఉంటుంది. ఇవాళ నిఫ్టి 22,500 స్థాయిని పరీక్షించే అవకాశముంది. 2020 మే తరవాత కనిష్ఠ స్థాయికి సెన్సెక్స్ పీఈ చేరడంతో… సెంటిమెంట్ చాలా బలహీనంగా ఉంది. మరోవైపు బ్యాంకుల ఫారెక్స్ పొజిషన్స్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. దీని ప్రభావం ఇవాళ బ్యాంక్ షేర్లపై ఉండనుంది. ఎందుకంటే ఆర్బీఐ చర్య కారణంగా బ్యాంకులు రూ.4,000 కోట్ల మేర MTM నష్టాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ చర్యల కారణంగా ఇవాళ రూపాయి బలపడనుంది. అయితే ఇది తాత్కాలికమేనని, క్రూడ్ ఇంకా పెరిగితే USDINR 96 దాటుతుందన్న అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలపై ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంది.
