తిక్కలోడితో తంటాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి కారణంగా ప్రపంచం వ్యాప్తంగా కల్లోలం నెలకొంది. అన్ని రకాల మార్కెట్లను అల్లకల్లోం చేస్తోంది. ముఖ్యంగా యుద్ధానికి సంబంధించి పదే పదే మాట మారుస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరితో ఇన్వెస్టర్లు విసిగిపోతున్నారు. ఏ మార్కెట్ కూడా స్థిరంగా ఉండలేకపోతోంది. అనలిస్టులు కూడా అంచనాలకు రాలేకపోతున్నారు. తాజాగా ఇరాన్‌కు డెడ్ లైన్ పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. మరో పది రోజులు దాకా ఇరాన్‌పై దాడులు చేయమని చెప్పారు. ఆ మేరకు ఇరాన్ తనకు విజ్ఞప్తి చేసిందన్నారు. అయితే ట్రంప్ ప్రకటనలను ఇరాన్ ఖండించింది. రాత్రి భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్… ట్రంప్ వ్యాఖ్యతో కోలుకుంది. అయితే ట్రంప్ పైకి చెప్పొదొకటి, చేసేది మరొకటని తెలుస్తోంది. పది రోజుల విరామం అంటూనే పశ్చిమాసియాకు పది వేల మంది సాయుధ దళాలను పంపేందుకు అమెరికా సిద్ధమౌతోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. యుద్ధానికి సన్నద్ధం అయ్యేందుకు ట్రంప్ ఆడుతున్న డ్రామా అని ఇరాన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు నిజం అవుతున్నాయి. ఇరాన్ ఆయిల్ లైఫ్‌లైన్ అయిన ఖర్గ్ ఐల్యాండ్పై అమెరికా దాడికి సిద్ధమౌతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మళ్ళీ క్రూడ్ మార్కెట్లో కలకలం మొదలైంది. బ్రెంట్ క్రూడ్ మళ్ళీ 107 డారల్లకు చేరింది.
