FII…. ఇండెక్స్‌లో భారీ షార్ట్స్
మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. అయితే షేర్ల కన్నా సూచీలో వీటి అమ్మకాలు జోరు అధికంగా ఉంది. ఇవాళ నిఫ్టి ప్యూచర్స్లో విదేశీ ఇన్వెస్టర్లు 3936 లాంగ్స్ ఉండగా, 11042 లాంగ్స్ ఉన్నాయి. అంటే వీటి నిష్పత్తి 14:86గా ఉంది. అయితే స్టాక్ ఫ్యూచర్స్‌లో మాత్రం బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. స్టాక్ ప్యూచర్స్లో వీటి లాంగ్స్ 21590 తగ్గగా, కొత్తగా 15940 షార్ట్స్‌ను చేర్చాయి. దీంతో వీటి నిష్పత్తి 58:42గా ఉంది. క్యాష్ మార్కెట్లో దేశీయ ఇన్వెస్టర్లు రూ. 3253 కోట్ల నికర కొనుగోళ్ళు చేయగా, విదేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాలు రూ. 2714 కోట్లు. ఎంపిక చేసిన షేర్లను కొంటూ సూచీలో మాత్రం ఇంకా షార్ట్‌లో ఉన్నాయి ఎఫ్ఐఐలు. ఇవాళ ఐటీ, ఆటో షేర్లతో పాటు రియల్ ఎస్టేట్ షేర్లకు గట్టి మద్దతు లభించింది. నిఫ్టి 196 పాయింట్లు లాభపడగా, సెన్సెక్స్ 633 పాయింట్ల లాభంతో ముగిసింది. ఇవాళ ఐటీ సూచీ 2.8 శాతం పెరగ్గా, రియాల్టి, ఆటో, మీడియా, క్యాపిటల్ గూడ్స్సూచీలు మూడు శాతం దాకా లాభపడ్డాయి. ఇవాళ ఎఫ్ఎంసీజీ, మెటల్స్‌లో ఒత్తిడి వచ్చినా… భారీ నష్టాలు మాత్రం లేవు. ఇవాళ స్టార్ షేర్‌గా అర్బన్ కంపెనీ నిలిచింది. నిఫ్టి టాప్ గెయినర్స్‌లో జియో ఫైనాన్స్, ఎటర్నల్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. టాప్ లూజర్స్‌లో సిప్లా, హిందుస్థాన్‌లీవర్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, సన్ ఫార్మా ఉన్నాయి. అధిక స్థాయిలోనైనా ఆయిల్ స్థిరంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండటం…. మార్కెట్‌కు కలసి వచ్చిన అంశాలు.
