For Money

Business News

జియో కోసం రూల్స్‌ మార్పు

జియో ప్లాట్‌ఫామ్స్‌ కంపెనీ లిస్టింగ్‌ కోసం ఏకంగా లిస్టింగ్‌ రూల్స్‌నే మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇపుడున్న నిబంధనల ప్రకారం పోస్ట్‌ ఐపీఓ (అంటే లిస్టింగ్‌ తరవాత) మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో 5 శాతం ఈక్విటీని ఐపీఓ కింద అమ్మాల్సి ఉంటుంది. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్‌ మార్కెట్‌ క్యాపిటలజైషన్‌ సుమారు రూ. 15.5 లక్షల కోట్లుగా లెక్కిస్తున్నారు. ఇపుడున్న నిబంధనల మేరకు పబ్లిక్‌ ఆఫర్‌ చేయాల్సి వస్తే సుమారు రూ. 80,000 కోట్ల విలువైన షేర్లను పబ్లిక్‌ ఆఫర్‌ కింద అమ్మాల్సింది. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో ఈ స్థాయి ఇష్యూ విజయం కావడం కష్టమని మార్కెట్‌ వర్గాలు అంటున్నారు. ఇపుడున్న నిబంధనల ప్రకారం మార్కెట్‌ క్యాప్‌ రూ 5 లక్షల కోట్లు దాటితే 5 శాతం పబ్లిక్‌ ఆఫర్‌ కింద జారీ చేయాల్సింది. దీంతో కేంద్ర ప్రభుత్వం లిస్టింగ్‌ నిబందనలను మార్చింది. కొత్త నిబంధనల ప్రకారం మార్కెట్‌ క్యాప్‌ రూ. 5 లక్షలు దాటితే కేవలం 2.5 శాతం వాటా విక్రయిస్తే చాలు. దీంతో జియో ప్లాట్‌ఫామ్స్‌ ఇపుడు రూ. 40,000 కోట్ల ఆఫర్‌ ఫర్‌ సేల్‌ చేయనుంది. తాజా నిబంధనలతో ఎన్‌ఎస్‌ఈకి కూడా ఊరట లభించే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.

Leave a Reply