దలాల్ స్ట్రీట్ అప్డేట్స్
మన స్టాక్ మార్కెట్లో అమ్మకాలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. వరుసగా రెండు రోజుల భారీ నష్టాల తరవాత కూడా గిఫ్ట్ నిఫ్టి నష్టాలను చూపుతోంది. సుమారు 50 పాయింట్ల నష్టంతో గిఫ్ట్ నిఫ్టి ఉంది. ఈ లెక్కన నిఫ్టి ఇవాళ 25800 స్థాయిని కోల్పోయే ఛాన్స్ ఉంది. నిన్న విదేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాలు రూ. 3760 కోట్లపైనే ఉంది. వరుసగా 33వ సెషన్లో దేశీయ ఇన్వెస్టర్లు కొన్నారు. అయినా నిఫ్టికి నష్టాలు తప్పలేదు. దీనికి కారణం రీటైల్ ఇన్వెస్టర్ల అమ్మకాలు కూడా కారణమే. ఇవాళ అదానీ గ్రీన్‌లో బ్లాక్ డీల్ జరుగనుంది. JSW ఎనర్జీలో రూ. 676 కోట్ల షేర్లను అమ్మిన GQG పార్ట్నర్స్ అమ్మనుంది. మరి ఈ షేర్ పెరుగుతుందా? తగ్గుతుందా అన్నది చూడాలి. అలాగే ఇండిగో షేర్లో కూడా డౌన్ ట్రెండ్ కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి. ఇండిగో విమాన సర్వీసురల్లో పది శాతం కోత విధించడంతో పాటు….ఇండిగో గుత్తాధిపత్య ఆరోపణలపై సీసీఐ దర్యాప్తు చేయనుంది. ఈనేపథ్యంలో ఇండిగో షేర్ కదలికలు కీలకం కానున్నాయి. మరోవైపు ఇవాళ స్విగ్గీ షేర్ కూడా స్పందించనుంది. క్యూఐపీ ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించాలని స్విగ్గీ బోర్డు నిర్ణయించింది. షేర్ ఆఫర్ ధర రూ. 390.51గా స్విగ్గీ నిర్ణయించింది. మరోవైపు
పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ షేర్ ఇవాళ గ్రీన్‌లోకి వస్తుందా అన్నది చూడాలి. ఈ కంపెనీపై ఇచ్చిన నివేదికలో తప్పులు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అంగీకరించింది. ఈ రిపోర్ట్‌ను తొలగించడంతో పాటు తమకు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సారీ చెప్పినట్లు పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.
