వెండి @ రూ. 2 లక్షలు!
అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఇవాళ రాత్రి మరోసారి వడ్డీ రేట్లను తగ్గించనుంది. దీంతో బులియన్‌కు డిమాండ్ పెరుగుతోంది. అయితే బంగారం కన్నా వెండి చాలా వేగంగా పెరగడం విశేషం. చరిత్రలో తొలిసారి రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్ వెండి ధర 60 డాలర్లను దాటింది. మన మార్కెట్లో అంటే MCXలో రాత్రి కిలో వెండి ధర రూ. 1.88లక్షలకు చేరింది. ఇవాళ కూడా అమెరికా వెండి ధర పెరిగి 61 డాలర్లను దాటింది. ఈలెక్కన మన మార్కెట్లో వెండి ధర రూ. 2 లక్షలను క్రాస్ చేసే ఛాన్స్ అధికంగా ఉంది. ఇకస్పాట్ మార్కెట్లో ఇప్పటికే రూ. 2 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది.
