For Money

Business News

భారీ నష్టాల్లో మెగా షేర్‌

విద్యుత్తు బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ షేర్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. మెగా ఇంజినీరింగ్‌ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ తాము ఇచ్చిన కాంట్రాక్ట్‌ మేరకు బస్సులు సరఫరా చేయలేదని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఈఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ షేర్‌ ఓపెనింగ్‌లో 14 శాతం క్షీణించి రూ.1,160కి చేరుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి కంపెనీకి వచ్చిన ఆర్డరు రద్దుకున్నాయని ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రికలో వచ్చిన కథనం నేపథ్యంలో షేర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ షేర్లు 6.42 శాతం నష్టంతో రూ.1,259 వద్ద ట్రేడయ్యాయి. కాని క్లోజింగ్‌ సమయానికి ఈ షేర్‌ 6.65 శాతం నష్టంతో రూ. 1255 వద్ద రూ. 89.5 నష్టంతో ముగిసింది. ఈ కంపెనీ షేర్‌ గత నెలలో అంటే ఏప్రిల్‌లో రూ. 989.95ని తాకింది.