బీవైడీ కార్ల ధర 35% తగ్గింపు

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో రారాజు అయిన బీవైడీ తాజా తీసుకున్న నిర్ణయం ఈవీ మార్కెట్‌ను కుదిపేసింది. చైనాకు చెందిన బీవైడీ ఇప్పటికే యూరప్ మార్కెట్‌లో నంబర్‌వన్‌గా మారింది. అమెరికాలో కూడా టెస్లా అమ్మకాలను దాటడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాను ఉత్పత్తి చేసే 22 మోడల్ కార్ల ధరలను 35 శాతం దాకా తగ్గించింది. అనేక దేశాల్లో డీలర్ల వద్ద కార్ల నిల్వలు పెరిగిపోవడంతో కంపెనీ ధరలను తగ్గించింది. దీంతో ఇతర ఈవీ కంపెనీలు బెంబేలెత్తిపోతున్నాయి. హాంగ్‌కాంగ్ మార్కెట్ బీవైడీ కంపెనీ షేర్ కూడా 10 శాతం దాకా తగ్గింది. ఇతర ప్రధాన ఈవీ తయారీ కంపెనీల షేర్ల పరిస్థితి ఇంతే. అయితే బీవైడీ చర్యతో ప్రత్యర్థులు హడలిపోతున్నారు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గని ఈ కారు ధరలు ఏకంగా దాదాపు 35 శాతం దాకా తగ్గడంతో తమ సంగతి ఏమిటని ప్రత్యర్థి కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. బీవైడీ తయారు చేసే ఈవీలలో చౌక ధరకు లభించే సీగుల్ హ్యాచ్‌బ్యాక్ కారు ధరను కూడా కంపెనీ 20 శాతం తగ్గించింది. అలాగే డ్యూయల్ మోటార్ హైబ్రిడ్ సెడాన్ కారైన ద సీల్ ధరను ఏకంగా 34 శాతం తగ్గించింది.