ఇవాళ్టి లాభాలన్నీ కోల్పోయిన నిఫ్టి
16,700ను నిఫ్టి దాటగలిగింది కాని.. కొన్ని నిమిషాల్లోనే మొత్తం లాభాలను కోల్పోయింది. ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైన నిఫ్టి సరిగ్గా మిడ్ సెషన్‌లో 16,712 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. అక్కడి నుంచి భారీగా నష్టపోయినా… సెషన్ వరకు తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. స్క్వేర్ ఆఫ్ సెషన్ ప్రారంభానికి ముందు నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠస్థాయి 16.617ని తాకింది. దాదాపు 95 పాయింట్ల లాభాన్ని కోల్పోయింది. కేవలం ఆల్గో ట్రేడింగ్ లెవల్స్‌ను అందుకోవడానికే మి డ్ సెషన్‌లో కేవలం కొన్ని నిమిషాలు ఉవ్వెత్తున లేచి పడింది నిఫ్టి. క్రితం ముగింపుతో పోలిస్తే 12 పాయింట్ల లాభంతో 16,637 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టి అర శాతం దాకా నష్టపోగా, మిడ్ క్యాప్ సూచీ కూడా నష్టాల్లో ముగిసింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
అదానీ పోర్ట్స్ 722.90 3.95
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ 686.00 2.22
హిందాల్కో 429.50 2.06
ఓఎన్‌జీసీ 115.50 2.03
టాటా మోటార్స్ 284.15 1.55
నిఫ్టి టాప్ లూజర్స్
బజాజ్ ఫిన్ సర్వ్ 15,939.00 -3.18
టైటాన్ 1,824.75 -2.40
టాటా స్టీల్ 1,385.40 -1.37
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 682.50 -1.32
యాక్సిస్ బ్యాంక్ 736.65 -1.30