For Money

Business News

ఐపీఓ ప్రతిపాదన ఉపసంహరణ

హీరో మోటార్స్‌ కంపెనీ తన ఐపీఓ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. మార్కెట్‌ నుంచి రూ. 900 కోట్లు సమీకరించేందుకు ఈ కంపెనీ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. అయితే ఈ ప్రాస్పెక్టస్‌ను కంపెనీ ఉపసంహరించుకుంది. ఆగస్టు నెలలో కంపెనీ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దీని ప్రకారం రూ. 500 కోట్లను తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించాలని కంపెనీ భావించింది. మరో రూ. 400 కోట్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ షేర్లను ఈ ఆఫర్‌ ద్వారా అమ్ముకోదలిచారు. హీరో మోటోకార్ప్‌ ఛైర్మన్‌ పవన్‌ ముంజాల్‌కు అత్యంత సమీప బంధువైన పంకజ్‌ ముంజాల్‌కు చెందిన హీరో మోటార్స్‌ ఆటో విడిభాగాలను తయారు చేస్తోంది.

Leave a Reply