For Money

Business News

F&O: కొత్త ఆంక్షలు షురూ

కీలక ప్రతిపాదనలు…

1. కనీస ట్రేడింగ్‌ మొత్తం రూ. 5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంపు
2. వారానికి ఒక్కో ఎక్స్ఛేంజీకి డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్‌ ఒకటికి తగ్గింపు
3. ఈక్విటీ ఇండెక్స్‌ డెరివేటివ్స్‌ ఇంట్రాడే పొజిషన్స్‌ను స్టాక్‌ ఎక్స్ఛేంజీలు పర్యవేక్షించాలి

ఊహించిటన్లే ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (F&O) నిబంధనలను స్టాక్‌ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మరింత కఠినం చేసింది. కొత్త నిబంధనలు నవంబర్‌ 20వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఒక సర్క్యులర్‌ను సెబీ జారీ చేసింది. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ విభాగంలో ఇన్వెస్టర్లకు మరింత రక్షణ కల్పించడమే గాక… మార్కెట్‌లో స్థిరత్వం కోసం కొత్త నిబంధనలు తెచ్చినట్లు సెబీ పేర్కొంది. ఇక నుంచి డెరివేటివ్స్‌ ఎక్స్‌పెయిరీలు వీక్లీ మాత్రమే ఉంటాయి. ప్రతి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఇక నుంచి వీక్లీ ఎక్స్‌పెయిరీతో కేవలం ఒక బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌ ఆధారంగా డెరివేటివ్స్‌ జారీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎఫ్‌ అండ్‌ ఓలో ట్రేడింగ్‌ చేయడానికి కనీస మొత్తాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచింది. ఈక్విటీ ఇండెక్స్‌ డెరివేటివ్స్‌ విషయంలో ఇంట్రాడే పొజిషన్‌ లిమిట్స్‌ను ఎప్పటికపుడు పర్యవేక్షించాల్సిందిగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలను సెబీ కోరింది. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆప్షన్‌ ప్రీమియంను, పెంచిన మార్జిన్స్‌ను ముందుగానే ట్రేడర్ల నుంచి తీసుకునేందుకు ఉద్దేశించిన నిబంధనలను అమలు పర్చనుంది. ఎక్స్‌పెయిరీ రోజున షార్ట్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్ట్‌ల విషయంలో అదనంగా మరో రెండు శాతం మార్జిన్‌ను వసూలు చేయాలని కూడా సెబీ ఆదేశించింది. డెరివేటివ్స్‌ మార్కెట్‌పై ఒక నిపుణుల వర్కింగ్‌ గ్రూప్‌తో పాటు సెకండరీ మార్కెట్‌పై ఒక అడ్వయిజరీ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. వాటి ఆధారంగా గత జులైలో తీసుకు రాబోతున్న సంస్కరణలపై ముసాయిదా పత్రాన్ని విడుదల చేసి… నిపుణుల నుంచి సలహాలు కోరింది. వీటి ఆధారంగా ఇవాళ కొత్త నిబంధనలను ఖరారు చూస్తూ సర్క్యులర్‌ను జారీ చేసింది.

ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టి, బ్యాంక్‌ నిఫ్టి, మిడ్‌ క్యాప్‌, ఫిన్‌ నిఫ్టి వీక్లీ కాంట్రాక్ట్స్‌ ఉన్నాయి. అలాగే బీఎస్‌ఈకి సెన్సెక్స్‌, బ్యాంకెక్స్‌ ఉన్నాయి. ఇక నుంచి ఎన్‌ఎస్‌ఈ ఒక కాంట్రాక్ట్‌ను, బీఎస్‌ఈ కూడా ఒక కాంట్రాక్ట్‌ను ఎంపిక చేసుకోవాలి.