For Money

Business News

నష్టాల్లో నిఫ్టి

నిన్నటి భారీ లాభాల తరవాత నిఫ్టి నష్టాలతో ప్రారంభమైంది. 25,430 వద్ద ప్రారంభమైన నిఫ్టి… ప్రస్తుతం 25,328 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 60 పాయింట్లు నష్టంతో ఉంది. ఇవాళ మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు గ్రీన్‌లో ఉన్నా నిఫ్టి బ్యాంకులో స్వల్ప నష్టాలు కన్పిస్తున్నాయి. నిఫ్టిలో 33 షేర్లు నష్టాల్లో ఉండగా, 16 షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌ ఇవాళ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో ముందున్నాయి. నిన్నటి దాకా భారీగా పెరిగిన ఏషియన్‌ పెయింట్స్‌, దివీస్‌ ల్యాబ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎం అండ్ ఎంతో పాటు అదానీ ఎంటర్‌ప్రైజస్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.