మస్క్ టూర్ రద్దు దీనికేనా?
టెస్లా చీఫ్ ఎలాన్‌మస్క్ భారత్ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 21, 22 తేదీల్లో మస్క్ మనదేశంలో పర్యటించాల్సి ఉంది. 21వ తేదీన ఆయన ప్రధాని మోడీని కలుస్తారని వార్తలు కూడా వచ్చాయి. ఈ భేటీ తరవాత భారత్‌లో పెట్టుబడులకు సంబంధి మస్క్ ఓ కీలక ప్రకటన చేస్తారని కూడా భావించారు. తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాల్సిందిగా చాలా రాష్ట్రాలు బహిరంగంగా ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలు లాబీయింగ్ కూడా ప్రారంభించాయి. అయితే మస్క్ పర్యటన ఆకస్మకంగా రద్దు అయింది. ఈ ఏడాది చివర్లో ఆయన భారత్‌లో పర్యటిస్తారని భావిస్తున్నారు.
టెస్లా షేర్ ఢమాల్
టెస్లా ఈవీలకు అమెరికాలో భారీ డిమాండ్ వెనుక అమెరికా ప్రభుత్వ సబ్సిడీల సాయం కూడా ఉంది. అయినా ఆ దేశంలో టెస్లా అమ్మకాలు అనుకున్నస్థాయిలో సగడం లేదు. ముఖ్యంగా ఇతర మార్కెట్లలో చైనా ఈవీ కంపెనీల జోరు అధికంగా ఉంది. అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో చైనా ఈవీలకు అనూహ్య ఆదరణ లభిస్తోంది. దీంతో టెస్లా కంపెనీ ఆర్థిక పరస్థితి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి వాల్‌స్ట్రీట్‌లో. ట్విటర్ వంటి తనకు సంబంధంలేని మార్కెట్లలో మస్క్ ఎంటర్ కావడం కూడా టెస్లా ఇన్వెస్టర్లకు ఇష్టం లేదు. దీంతో చాలా మంది టెస్లా షేర్లను వొదిలించుకున్నారు. గరిష్ఠ స్థాయి నుంచి టెస్లా షేర్ 65 శాతం నష్టపోయిందంటే… ఈ కంపెనీపై ఇన్వెస్టర్లకు ఉన్న క్రేజ్ ఎలా తగ్గుతుందో అర్థమౌతోంది. దీంతో కంపెనీ ఇన్వెస్టర్లతో టెస్లా అధినేత మీటింగ్ ఏర్పాటు చేశారు. కంపెనీ పట్ల ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నిస్తారు. ప్రస్తుత సమయంలో టెస్లా షేర్ నిలకడగా రాణించడం చాలా కీలకంగా మారింది. దీంతో ఎలాన్ మస్క్ తన భారత పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.