For Money

Business News

HDFC BANKఫలితాలు… మెరుపులేవి?

మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ చక్కటి ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే బ్యాంక్‌ నికర లాభం రెండు శాతం పెరిగి రూ.17,622.38 కోట్లకు చేరింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ.17,257.87 కోట్లు. స్టాండర్డ్‌లోన్‌ పద్ధతిలో నికర లాభం రూ.16,372.54 కోట్ల నుంచి రూ.16,511.85 కోట్లకు పెరిగింది. పూర్తి ఏడాదికి చూస్తే రూ.64,060 కోట్ల నికర లాభాన్ని బ్యాంక్‌ ఆర్జించింది. గత ఏడాది ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బ్యాంక్‌ నికర లాభం 37 శాతం పెరిగింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ రూ. 29,077 కోట్ల నికర వడ్డీ ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాదిజులైలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ విలీనమైంది. దీంతో గతేడాది త్రైమాసిక ఫలితాలను పోల్చడం సరికాదని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. డిసెంబర్‌తోముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ ఆదాయం రూ.47,240 కోట్లు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్‌ అమ్మకం ద్వారా వచ్చిన రూ.7,340 కోట్ల ఆదాయం కూడా ఇందులో ఉంది. బ్యాంక్‌ ఇతర ఆదాయం రూ.18,170 కోట్లు కాగా స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి (ఎన్‌పీఏ 1.26 శాతం నుంచి 1.24 శాతానికి తగ్గినట్లు బ్యాంక్‌ పేర్కొంది. పూర్తి సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.19.5 చొప్పున చెల్లించేందుకు బ్యాంక్‌ బోర్డు సిఫార్సు చేఉసింది.
మెరుపులు లేవు
బ్యాంక్‌ పనితీరు తమ అంచనాల మేరకే ఉన్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే బ్యాంక్‌ ఫలితాల్లో చెప్పుకోదగ్గ మార్పులు లేవని అంటున్నారు. ముఖ్యంగా బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయంలో పెద్దగా వృద్ధి లేకపోవడం ఆందోళన కల్గిస్తోందని వీరు అంటున్నారు. బ్యాంక్‌ నిమ్స్‌ 4 శాతం లోపునకు పడిపోయాయని… వాస్తవానికి కీలక నిమ్స్‌్ కేవలం 3.44 శాతం మాత్రమే ఉందని వీరు అంటున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో నిమ్స్‌ 4.1 శాతం ఉండగా… ఇపుడు 3.4 శాతానికి క్షీణించిన విషయాన్ని వీరు ప్రస్తావిస్తున్నారు.

Leave a Reply