కొనసాగుతున్న అప్‌ట్రెండ్
అమెరికా ఫెడ్ నిర్ణయం తరవాత అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ కొనసాగుతోంది. నిన్న భారీగా పెరిగిన సూచీలు ఇవాళ కూడా తమ అప్ ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. రాత్రి అమెరికా, ఇవాళ ఉదయం ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. ఇక మన మార్కెట్లో కూడా అప్‌ట్రెండ్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 296 పాయింట్లు పెరిగి 70,810 వద్ద, నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 21,274 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ రెండు సూచీలు రోజుకో గరిష్ఠ స్థాయిలను తాకుతున్నాయి. నిఫ్టి లో 37 షేర్లు లాభాల్లో ఉండగా, 13 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి ఫైనాన్స్ మినహా మిగిలిన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. ముఖ్యంగా నిఫ్టీ నెక్ట్స్, మిడ్ క్యాప్ సూచీలు కొత్త ఆల్‌టైమ్ గరిష్ఠాలను తాకుతున్నాయి. ఇన్ఫోసిస్ ఇవాళ కూడా లాభాలతో ట్రేడవుతోంది. నిఫ్టి రూ. 1538 వద్ద ట్రేడవుతోంది. హిందాల్కో, జిందాల్ స్టీల్, టాటా స్టీల్ వంటి మెటల్ షేర్లు టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి.