For Money

Business News

దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ జోరు

అంతర్జాతీ మార్కెట్లలో అమెరికా ఫెడ్‌ నిర్ణయం ఎఫెక్ట్‌ కొనసాగుతోంది. చైనా మినహా… అమెరికాతో అనుసంధానంగా ఉన్న దాదాపు అన్ని మార్కెట్లలో లాభాలు కొనసాగుతున్నాయి. ఇక మన మార్కెట్‌లో నిఫ్టి ఆరంభంలో ఒక మోస్తరు లాభాలతో ఉంది. కాని చివర్లో అందిన మద్దతు కారణంగా నిఫ్టి 21,492 పాయింట్ల స్థాయిని తాకింది. అక్కడి నుంచి స్వల్పంగా కరెక్టయి 21,456 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి ఇవాళ 273 పాయింట్ల మేర లాభపడింది. సెన్సెక్స్‌ కూడా పైగా పాయింట్లను తాకి 71,483.75 వద్ద ముగిసింది.
సెన్సెక్స్‌ 30లో నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ సుజుకీ, ఐటీసీ, కోటక్ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు మినహా అన్ని షేర్లూ రాణించాయి. నిఫ్టిలో హెచ్‌సీఎల్ టెక్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 5 శాతంపైగా లాభపడ్డాయి. ఎస్‌బీఐ, టాటా స్టీల్‌ కూడా లాభాలతో ముగిశాయి. ఐటీ షేర్లలో అప్‌ ట్రెండ్‌ కొనసాగింది. ఐటీబీస్‌ ఇవాళ రూ. 38ని టచ్‌ చేయడం విశేషం. మరోవైపు ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, రియల్టీ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు.