For Money

Business News

అదరగొట్టిన డోమ్స్‌

అనధికార మార్కెట్‌లో భారీ ప్రీమియం పలుకతుండటంతో డోమ్స్‌ ఇండస్ట్రీస్‌కు సాధారణ ఇన్వెస్టర్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. పెన్సిళ్ల తయారీ డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ ఇవాళ ముగిసింది. ఈ ఐపీఓకు 93.40 రెట్ల బిడ్లు వచ్చాయి. ముఖ్యంగా ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల నుంచి వచ్చిన అనూహ్య స్పందన రావడం విశేషం. మార్కెట్‌ నుంచి రూ.1,200 కోట్ల సమీకరణకు డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ 88.37 లక్షల షేర్లను ఆఫర్‌ చేస్తోంది. ఇవన్నీ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అమ్ముతున్నారు. ఇవాళ క్యూఐబీల కోటా ఏకంగా 115.97 రెట్లు సబ్‌స్క్రైబ్‌ కాగా.. రిటైల్‌ పోర్షన్‌ 69.10 రెట్ల బిడ్లు దాఖలయ్యయి. ఒక్కో షేరును కనిష్ఠంగా రూ.750- గరిష్ఠంగా రూ. 790లకు కంపెనీ ఆఫర్‌ చేసింది. మెజారిటీ బ్రోకింగ్ సంస్థలు ఈ ఆఫర్‌ను రెకమెండ్‌ చేశాయి. ఈ షేర్‌ అనధికార మార్కెట్‌లో రూ. 540 ప్రీమియం పలుకుతోంది. అంటే ఈ షేర్‌ రూ. 1300 ప్రాంతంలో లిస్ట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట.