For Money

Business News

16,300పైన ఓపెనైన నిఫ్టి

నిఫ్టి పటిష్ఠంగా ప్రారంభమైంది. 16,274 వద్ద ప్రారంభమైన నిఫ్టి 16261ని తాకినా… వెంటనే కోలుకుని 16,300పైకి చేరింది. ప్రస్తుతం 45 పాయింట్ల లాభంతో 16,303 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ సూచీ కూడా 0.4 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 34 షేర్లు గ్రీన్‌లో ఉన్నా… నిఫ్టి స్వల్ప లాభానికే పరిమితమైంది. చాలా షేర్లు నామ మాత్రపు లాభాల్లో ఉండటమే దీనికి కారణం. నిఫ్టికి 16,330 లోగా గట్టి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశముంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
కొటక్‌ మహీంద్రా 1,801.20 1.14
టైటాన్‌ 1,816.35 0.96
హిందాల్కో 438.55 0.89
హెచ్‌డీఎఫ్‌సీ 2,646.60 0.87
ఎం అండ్‌ ఎం 780.65 0.74

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
శ్రీసిమెంట్‌ 27,620.00 -2.31
పవర్‌గ్రిడ్‌ 174.35 -1.19
హీరో మోటోకార్ప్‌ 2,813.65 -0.80
బ్రిటానియా 3,618.00 -0.50
నెస్లే ఇండియా 18,113.05 -0.49